
అక్కినేని అభిమానులు అఖిల్ అక్కినేని ఫస్ట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అఖిల్ కూడా తన మొదటి సినిమాతో అన్ని రకాలుగా ప్రేక్షకులను మెప్పించడానికి పర్ఫెక్ట్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న స్పెయిన్ షెడ్యూల్ నేటితో ముగిసింది. ఈ చిత్ర టీం రేపు తిరిగి ఇండియాకి రానున్నారు. ఇక్కడ కొద్ది రోజుల తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ షెడ్యూల్ చేయనున్నారు. జూన్ చివరి కల్లా హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసి జూలై 1 నుంచి సాంగ్స్ షూటింగ్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు. ఇప్పటికే అబ్రాడ్ షెడ్యూల్ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.
సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. మాస్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేసే వివి వినాయక్ ఈ సినిమాకి డైరెక్టర్. వినాయక్ చాలా జాగ్రత్తగా ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అఖిల్ తో పాటు బాలీవుడ్ భామ సయేషా సైగల్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కానుంది. అఖిల్ మొదటి సినిమాని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. అఖిల్ మొదటి సినిమా విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని నితిన్ దగ్గరుండి మరీ ప్రొడక్షన్ వాల్యూస్ ని చూసుకుంటున్నాడు. వెలిగొండ శ్రీనివాస్ కథని అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ డైలాగ్స్ రాస్తున్నాడు. అనూప్ రూబెన్స్ – ఎస్ఎస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

