తొలినాళ్ళలో టిక్కెట్ రేట్ పెంచనున్న బాహుబలి?

తొలినాళ్ళలో టిక్కెట్ రేట్ పెంచనున్న బాహుబలి?

Published on May 26, 2015 2:52 AM IST

prabhas-baahubali
ఒక క్రేజీ కాంబినేషన్ లో భారీ చిత్రం విడుదలవుతుంది అంటేనే సినీ ప్రియుల ఆనందానికి అవధులు వుండవు. అ;అలాంటి సినీ మానియాక్స్ యొక్క పిచ్చి క్యాష్ చేసుకోవడానికి విడుదలైన తొలివారం అదనపు టిక్కెట్ ధరలతో గతంలో మన ప్రభుత్వం కొత్త ప్రయత్నం చేసింది.అయితే కొన్నాళ్ళకు ఈ విధానం అటకెక్కింది. తాజా సమాచారం ప్రకారం మరోసారి ‘బాహుబలి’ రూపంలో ఈ టిక్కెట్ బాంబ్ ప్రేక్షకుడిపై పడనున్నట్లు సమాచారం.

ఈ సినిమా బడ్జెట్ (150కోట్లను) దృష్టిలో పెట్టుకుని సినిమా విడుదలైన వారాంతరంలో మల్టీప్లెక్స్ టిక్కెట్ ధర 150కి బదులుగా 250కి పెంచమని చిత్ర బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ని సంప్రదించినట్టు సమాచారం. సాధారణ థియేటర్ ధరలు కూడా రెట్టింపు చెయ్యమని కోరడం కొసమెరుపు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రతిష్టాత్మక బాహుబలి పార్ట్ 1 జూలై 10న మన ముందుకు రానున్న విషయం తెలిసినదే.

తాజా వార్తలు