బాలయ్య డిక్టేటర్ లో నాజర్ కీలక పాత్ర

బాలయ్య డిక్టేటర్ లో నాజర్ కీలక పాత్ర

Published on May 28, 2015 9:43 PM IST

Nassar
విలక్షణ నటుడు నాజర్ నటసింహం బాలకృష్ణ నటించనున్న 99 వ సినిమా ‘డిక్టేటర్’లో ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి కోనావెంకట్, గోపీమోహన్ స్క్రిప్ట్ ని అందిస్తున్నారు. ఈ ఇద్దరు రచయితలూ నాజర్ కి తాను పోషించబోయే పాత్ర గురించి తెలుపగానే నాజర్ చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు సమాచారం.

ఈ నెల 29న ఈ చిత్రం లాంచనంగా ప్రారంభంకానుంది. అంజలి ఒక నాయికగా ఎంపికయ్యింది. లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈరోస్ సంస్థ నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు