మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!

మరో యాక్షన్ ప్రాజెక్ట్ లోకి దిగిన మ్యాచ్ స్టార్ గోపీచంద్!

Published on May 2, 2026 2:00 PM IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నుంచి కొంచెం గ్యాప్ తర్వాతే తన నెక్స్ట్ సినిమా థియేటర్స్ లో రానుంది కానీ తన లైనప్ పరంగా మాత్రం వరుస సినిమాలు తన చేతిలో ఉన్నాయని చెప్పొచ్చు. లేటెస్ట్ గా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకత్వంలో తన మొదటి సినిమా గోపీచంద్ తో చేయనున్నట్టు ఓ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ కలయికలో అఫీషియల్ గా ప్రాజెక్ట్ ని నిర్మాణ సంస్థ 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ వారు ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. గోపీచంద్ కెరీర్ 34వ సినిమాగా సాలిడ్ కన్ఫర్మేషన్ పోస్టర్ తో ఒక చిరుతని చూపిస్తూ ప్రెజెంట్ చేయడం ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి రేపింది.

ఇక ఈ సినిమా తాలూకా పూజా కార్యక్రమాన్ని రేపు మే 3న హైదరాబాద్ లో చేయనుండగా ఈ చిత్రానికి ఖైదీ, మహావతార్ నరసింహా సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ సంగీతం అందించనున్నాడు. ఇక మరిన్ని డీటెయిల్స్ రేపు బయటకి రానున్నాయి.

తాజా వార్తలు