
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే! సుమంత్ అశ్విన్, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియో సినిమాపై మంచి ఒపీనియన్‌ను క్రియేట్ చేశాయి. దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 12న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇటు సమ్మర్ ఎండింగ్, కాలేజ్ స్టార్టింగ్ రెండూ ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు కలిసివచ్చే అంశమని సినిమా యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చారు.

