
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రం కొంతకాలంక్రితమే చెన్నైలో మొదలైంది. ఇటీవలే బెంగుళూరుకి షూటింగ్ మకాం మార్చారు. ఇప్పుడు తిరిగి చెన్నైలో కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం బయల్దేరారు. మంజిమా మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం తదుపరి షెడ్యూల్ కేరళలో చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ లో ఒక పాటను, కొన్ని ముఖ్యసన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రెండు భాషలలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. రెహమాన్ స్వరాలను సమకూరుస్తున్నాడు.

