‘రావమ్మా మహాలక్ష్మి’గా జ్యోతిక రీఎంట్రీ సినిమా!

‘రావమ్మా మహాలక్ష్మి’గా జ్యోతిక రీఎంట్రీ సినిమా!

Published on May 29, 2015 11:00 AM IST

Jyothika
తెలుగు, తమిళ భాషల్లో అద్భుతమైన సినిమాలతో మెప్పించిన నటి జ్యోతిక, తమిళ సూపర్ స్టార్ సూర్యను పెళ్ళాడిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మళ్ళీ తొమ్మిదేళ్ళ తర్వాత తాజాగా ’36 వయధినిలె’ అనే సినిమాతో ఆమె మన ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మధ్యే తమిళ నాట భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. జ్యోతిక భర్త సూర్య ఈ సినిమాను స్వయంగా నిర్మించడం విశేషం.

ఇక తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలన్న ఆలోచనలో సూర్య ఉన్నారన్న విషయం తెలిసిందే. తెలుగులో ‘చంద్రముఖి’తో పాటు ‘ఠాగూర్’, ‘మాస్’, ‘షాక్’ చిత్రాలతో మెప్పించిన జ్యోతికకు ఇక్కడ మంచి గుర్తింపు ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తెలుగు వర్షన్‌కు సంబంధించిన కార్యక్రమాలు మొదలు కాగా, తాజాగా ‘రావమ్మా మహాలక్ష్మి’ అనే తెలుగు టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు. జూన్ నెలలో ’36 వయధినిలె’ తెలుగు వర్షన్ విడుదలయ్యే సూచనలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు