
రాజమౌళి ఏదిచేసినా సరికొత్తగా ప్లాన్ చేస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. గతంలో తన సినిమాలకు అంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించిన రాజమౌళి, ‘బాహుబలి’ విషయంలో మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉన్నారు. బాహుబలి ఆడియో రిలీజ్ వాయిదా పడిందన్న బాధలో ఉన్న అభిమానులకు జూన్ 1న ట్రైలర్, ఈరోజు సాయంత్రం 5 సెకండ్ల ట్రైలర్ విడుదల చేస్తామన్న వార్తతో బాహుబలి టీమ్ తీపి కబురు తెలియజేసిన విషయం తెలిసిందే!
కేవలం 5 సెకండ్ల పాటు సాగే ఆ ట్రైలర్ రిలీజ్‌ను కూడా రాజమౌళి సరికొత్తగా ప్లాన్స్ చేసుకుంటున్నాడు. రాత్రి 7:25ని. బాహుబలి టీజర్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రిలీజ్‌కు అరగంట ముందు రాజమౌళి, రానా ఇద్దరు టీవీ 5 స్టూడియో నుండి, అనుష్క ట్విట్టర్ ఎకౌంట్ నుండి టీజర్‌ను రిలీజ్ చేస్తారు. ప్రభాస్, రానా అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం యావత్‌దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే!

