యూరప్ షెడ్యూల్ ముగించుకున్న చరణ్ – వైట్ల బృందం

యూరప్ షెడ్యూల్ ముగించుకున్న చరణ్ – వైట్ల బృందం

Published on May 31, 2015 12:51 AM IST

ram-charn-srinu-vatila
రామ్ చరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఒక అన్ టైటిల్డ్ ప్రాజెక్ట్ ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్ లో జరుపుకుంటుంది. సమాచారం ప్రకారం చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య పాటలు చిత్రీకరించారు. నేటితో ఈ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ చేరుకోనున్నారు.

ఈ సినిమాకోసం చరణ్ థాయ్ లాండ్ లో ఫైట్ ల శిక్షణ పొందాడు. కోనావెంకట్ , గోపీమోహన్ ఈ సినిమాకు స్క్రిప్ట్ ని అందిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. దానయ్య డి.వి.వి నిర్మాత.

తాజా వార్తలు