నాగశౌర్య ‘జాదూగాడు’ రిలీజ్ వాయిదా..!

నాగశౌర్య ‘జాదూగాడు’ రిలీజ్ వాయిదా..!

Published on May 31, 2015 9:05 PM IST

jadugadu

‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి..’, చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా, మన పక్కింటి కుర్రాడిలా కనిపించి మంచి పేరు సంపాదించుకున్న యువహీరో నాగశౌర్య. తాజాగా ఆయన ‘జాదూగాడు’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ తనకున్న ఈ లవర్ బాయ్ ఇమేజ్ నుంచి కాస్త పక్కకొచ్చి చేస్తున్న ఈ సినిమా కోసం నాగశౌర్య ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు.

‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 5న పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే! అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. జూన్ 5న ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమైనందున ఎప్పట్నుంచో సోలో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ‘జాదూగాడు’ వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని సినిమా యూనిట్ తెలిపింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో నాగశౌర్య సరసన సోనారిక బదోరియా హీరోయిన్‌గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు