నేడే ‘బాహుబలి’ ట్రైలర్ రిలీజ్!

నేడే ‘బాహుబలి’ ట్రైలర్ రిలీజ్!

Published on Jun 1, 2015 11:00 AM IST

baahubali
తానేది చేసినా సరికొత్తగా ఉండాలనుకునే దర్శకుడు రాజమౌళి. తన సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి ఎప్పుడూ వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. ‘బాహుబలి’ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ మరి కొద్దిసేపట్లో విడుదల కానున్న విషయం తెలిసిందే!‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతోన్న బాహుబలి మొదటిభాగానికి సంబంధించిన ట్రైలర్‌ను ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఉదయం 10:30 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏర్పాటు చేసిన థియేటర్లలో ఆ సమయంలో ఎవరైనా వెళ్ళి ఉచితంగా ట్రైలర్‌ను చూడొచ్చు.

ఆన్‌లైన్లో మాత్రం సాయంత్రం 5 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్ కంటే ముందే ట్రైలర్‌ను చూడాలంటే కచ్చితంగా థియేటర్‌కి వెళ్ళాల్సిందే! ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు విపరీతంగా పెంచేయగా, నేడు విడుదలయ్యే ట్రైలర్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. తెలుగుతో పాటు హిందీలోనూ నేడే ట్రైలర్ విడుదల కానుంది. ఇక మొన్న విడుదలైన టీజర్ చూసినవారంతా బాహుబలి టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటున్నారు. కేవలం ఐదారు షాట్స్ చూస్తేనే ఈ స్థాయి అనుభూతి కలిగితే ఇక సినిమా ఇంకెంత అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందోనని అభిమానులు సోషల్ మీడియోలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. టీజర్‌ పంచిన ఆనందంతో ఉత్సాహం మీదున్న ‘బాహుబలి’ అభిమానుల కళ్ళన్నీ ట్రైలర్‌పైనే..!

‘బాహుబలి’ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు