హైదరాబాద్ చెన్నై ల మధ్య చక్కర్లు కొడుతున్న కార్తీ

హైదరాబాద్ చెన్నై ల మధ్య చక్కర్లు కొడుతున్న కార్తీ

Published on Jun 1, 2015 11:37 PM IST

karthi
తమిళనటుడు కార్తీ చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నాడు. ఈ టైట్ షెడ్యూల్ వల్ల తను హైదరాబాద్ చెన్నై ల మధ్య చక్కర్లు కొడుతున్నాడు. వంశీ పైడిపల్లి తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిస్తున్న ఓ చిత్రం లో కార్తీ నటిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో నాగార్జున కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ‘ది ఇంటచబుల్స్’ అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారం ఈ చిత్రం రూపొందుతుందని సమచారం.

ఈ చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని నాగార్జున మరియు కార్తీ ల పై చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ‘కాష్మోర’ అనే తమిళ చిత్ర షూటింగ్ లో కార్తీ పాల్గొంటున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నై లో’జరుగుతుంది అందువల్ల తన డేట్స్ ని ఎడ్జస్ట్ చేసుకుని ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం లో కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార మరియు శ్రీ దివ్య హీరొయిన్లుగా నటిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు