
ఎప్పుడెప్పుడు తమ హీరో కొత్త సినిమా మొదలుపెడతాడా? అని ఎదురుచూసిన అభిమానులకు శుభవార్తను అందిస్తూ ఈమధ్యే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా ‘గబ్బర్ సింగ్ 2’ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే! పూణేలోని ఓ చిన్న గ్రామంలో ‘గబ్బర్ సింగ్ 2’ షూటింగ్ మే 29న మొదలైంది. ఇక నేటితో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోవడం విశేషంగా కనిపిస్తోంది.
‘పవర్’ సినిమా ద్వారా హిట్ కొట్టిన బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకత్వం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేసుకుంటున్నారు.

