
పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు విశాఖ సముద్ర తీరాన మహా శివరాత్రి నాడు కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో 27 వ మహా కుంబాభిషేకం 20వ తేది సోమవారం నాడు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 10.౦౦ గంటల వరకు పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసు రావు సంగీత నిర్వహణలో ప్రముఖ గాయని గాయకులూ భక్తి సంగీత విభావరి నిర్వహిస్తారు. ఆ సందర్బంగా సాయంత్రం 5.00 గంటలకు ప్రముఖ చలన చిత్ర దర్శకులు రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ” బిరుదు ప్రదానం జరుగుతుంది. ఆ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర రావాణ శాఖ మాత్యులు మరియు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ బొత్స సత్యనారాయణ పాల్గొంటారు. పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు అధ్యక్షత వహిస్తారు. గౌరవ అతిధులుగా పర్యాటక శాఖ మాత్యులు శ్రీ వట్టి వసంత కుమార్, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పి,బాలరాజు, రాష్ట్ర మౌలిక సదుపాయాలు మరియు రేవుల శాఖ మాత్యులు శ్రీ ఘంటా శ్రీనివాస రావు, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్ శ్రీ R.V. రమణ మూర్తి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ పాల్గొంటారు. విశిష్ట అతిధిగా డా.డి.రామానాయుడు, ప్రత్యేక అతిధులుగా పద్మశ్రీ డా.కె.బ్రహ్మానందం, సిని నటీమణులు భానుప్రియ, మంజు భార్గవి, తులసి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని టి.సుబ్బరామి రెడ్డి లలితకళా పరిషత్ నిర్వహిస్తుంది.
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం”
Published on Feb 16, 2012 11:31 AM IST
సంబంధిత సమాచారం
- ఓటిటి సమీక్ష: ‘వదంది – సీజన్ 2’ – క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రైమ్ వీడియోలో
- ఇంటర్వ్యూ : హీరో శ్రవణ్ రెడ్డి – ‘అగధ’ డివైన్ అండ్ మిస్టిక్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది..!
- పోల్ : యష్ ‘టాక్సిక్’ ట్రైలర్ ఎలా అనిపించింది?
- ‘టాక్సిక్’ ట్రైలర్ టాక్ : హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో బాక్సాఫీస్ షేక్!
- సెన్సార్ పనులు ముగించుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’..!
- ‘వారణాసి’ నుంచి రాబోయే ట్రీట్ అదేనా..?
- హైదరాబాద్ సిటీ మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్స్ తో ‘కొరియన్ కనకరాజు’ హవా!
- తక్కువ హైప్ తో వచ్చి మెల్లగా ర్యాంపేజ్ స్టార్ట్ చేసిన ‘డిసి’..!
- సస్పెన్స్ గా ‘వారణాసి’ ట్రీట్.. ఉత్కంఠతో మహేష్ ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష :- కొరియన్ కనకరాజు – యాక్షన్ అండ్ కామెడీతో సాగే హారర్ రైడ్!
- సమీక్ష: ‘డిసి’ – మెప్పించే సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా
- శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?
- సమీక్ష : కేజేక్యూ (KJQ) – రొటీన్ ప్లే తో సాగే క్రైమ్ డ్రామా
- Ramayana English Trailer: AI లిప్-సింక్ టెక్నాలజీపై నెటిజన్ల ప్రశంసలు!.. హిందీ కంటే ఇంగ్లీష్ డబ్బింగ్ బాగుందా?
- ట్రైలర్ డేట్ లాక్ చేసుకున్న ‘పళ్ళబురుసు’.. ఎప్పుడంటే..?
- ట్రైలర్ టాక్ : లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో మెప్పిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’..!
- చరణ్ కోసం సుకుమార్ ఆ బ్యూటీని తీసుకొస్తాడా..?

