
దిల్ రాజు ఒక చిన్న సినిమాను నిర్మించి చాలారోజులు కావస్తుంది. వరుసపెట్టి భారీ బడ్జెట్ చిత్రాల తరువాత మన రాజుగారు ఇప్పుడు లో బడ్జెట్ లో ‘కేరింత’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని నిర్మించారు.
ఈ సినిమా వచ్చే శుక్రవారం విడుదలకానున్న నేపధ్యంలో దిల్ రాజు చిత్రాన్ని భారీగా ప్రచారం చేస్తున్నాడు. సినిమాను విజయతీరాలకు చేర్చే పనిలో వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని రాజు వదులుకోవడంలేదు.
సుమంత్ అశ్విన్, శ్రీ దివ్య మరియు తేజస్విని నటించిన ఈ సినిమాకు సాయికిరణ్ అడివి దర్శకుడు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

