
‘స్కై ఫాల్’, ‘బాట్ మాన్ బిగిన్స్’, ‘ఎక్ష్ మెన్’ వంటి ప్రముఖ హాలీవుడ్ చిత్రాలకి స్టంట్స్ కంపోస్ చేసిన రోజర్ యువన్ తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రానికి పనిచేస్తున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు ప్రభు సోల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావోస్తున్నాయి.
ధనుష్ ఒక పాంట్రీ వర్కర్ గా నటిస్తున్న ఈ చిత్రం ఒక ట్రావెల్ డ్రామా. కేరళ బ్యూటీ కీర్తి సురేష్ ఈ చిత్రానికి హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది.
ప్రస్తుతం ధనుష్ ‘వి ఐ పి 2’ చిత్ర షూటింగ్ లో బిజీ గా వున్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జోరుగా సాగుతుంది.

