
ఇండియాలోనే మొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా ప్రధాన ప్రాత్రాలు పోషించిన ఈ సినిమా రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదాటగా ‘బాహుబలి – ది బిగెనింగ్’ అనే ఫస్ట్ పార్ట్ ని జూలై 10న రిలీజ్ చెయ్యనున్నారు. ఒకేసారి ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో ఈ చిత్ర టీం ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. అది కూడా అబోల్ల్య్వుడ్ నుంచి ఈ చిత్ర టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. నిన్న సాయంత్రం ప్రభాస్, రానా, తమన్నా కలిసి ప్రమోషన్స్ కోసం కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇక నుంచి రోజూ ఈ చిత్ర టీం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రోజూ ప్రమోషన్స్ చేయనుంది. బాహుబలి సినిమా హిందీ వెర్షన్ స్పెషల్ ప్రీమియర్ షోని జూలై 9వ తేదీన ప్లాన్ చేసారు. ఈ ప్రీమియర్ షో కి బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారని నిన్ననే తెలియజేశాం.

