
సూపర్ స్టార్ రజినికాంత్ నటించనున్న తాజా చిత్రం ఆగష్టు నెలనుండి ప్రారంభంకానున్న విషయం తెలిసినదే. రజిని సన్నిహితుడు రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రజిని గత రెండు చిత్రాలు ఘోర పరాజయం చవిచూసిన కారణాన ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు చిత్రీకరించిన పాత్ర నచ్చడంతో ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మలేసియా, థాయ్ ల్యాండ్, హాంకాంగ్ ప్రాంతాలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. ప్రవీణ్ ఎడిటర్. అంబు, అరివే లు యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్ట్ చేయనున్నారు. కలైపులి ఎస్ థను ఈ చిత్రానికి నిర్మాత.

