ఆగష్టు మిడిల్ లో రానున్న ‘కిక్ 2’.?

ఆగష్టు మిడిల్ లో రానున్న ‘కిక్ 2’.?

Published on Jun 22, 2015 12:00 AM IST

kick-2

టాలీవుడ్ లో ఒక హిట్ సినిమాకి సీక్వెల్స్ రావడం తక్కువ. కానీ ఈ సారి డేర్ చేసి ఓ సూపర్ హిట్ ఫిల్మ్ కి సీక్వెల్ చేసారు. అదే మాస్ మహారాజ్ రవితేజ నటించిన క్రేజీ సీక్వెల్ ‘కిక్ 2’. 2009లో వచ్చిన కిక్ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమాని తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. మొదట ఈ సినిమాని మే రిలీజ్ అనుకున్నారు ఆ తర్వాత జూన్ కి వచ్చింది కానీ జూన్ లో కూడా రిలీజ్ కాలేదు.

ఇటీవలే ఈ సినిమా జూలై చివరికి వెళ్ళే అవకాశం ఉందని అన్నారు కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగష్టు మిడిల్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఈ చిత్ర టీం ఉందని తెలియజేశారు. సరైన రిలీజ్ డేట్ లేకపోవడం వలనే అంత వెనక్కి వెళ్ళినట్లు సమాచారం. కాస్త గ్యాప్ దొరకడంతో సిజి ఎఫెక్ట్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఎక్కువ కేర్ తీసుకొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేస్తున్నారు.

కిక్సినిమాలో లానే కిక్ 2 లో కూడా ఆద్యంతం కామెడీ ఉంటూనే ఆడియన్స్ ని థ్రిల్ చేసే ట్విస్ట్ లు కూడా ఉంటాయని సమాచారం. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు