ట్విట్టర్లో చేరిన రమ్యకృష్ణ

ట్విట్టర్లో చేరిన రమ్యకృష్ణ

Published on Jun 25, 2015 12:23 AM IST

Ramya-krishna
సోషల్ నెట్వర్కింగ్ పుణ్యమా అని ఎంతో మంది స్టార్లు తమ అభిమానులతో నేరుగా ముచ్చటిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఒకింత రిస్కు, బెడద వున్నప్పటికీ చాలా మంది ఈ వేదికను వినియోగించుకుంటున్నారు. సినిమా రంగంలో ఈ తతంగం మరింత పాపులర్ అవుతుంది. తాజాగా ట్విట్టర్ లోకి నటీమణి రమ్యకృష్ణ రావడంతో తన అభిమానులు ఫాలో అవడం మొదలుపెట్టారు.

‘meramyakrishnan’ అనే పేరుతొ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రావడంతోనే అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఏజడ్ బ్యూటీ ఒక తమిళ చిత్రంలో నటిస్తుంది.తెలుగులో నాగార్జున నటిస్తున్న సినిమాలో కనిపించడమేకాక బాహుబలిలో శివగామి పాత్రలో ఆకట్టుకోనుంది.

తాజా వార్తలు