ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం “రాకా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఫాంటసీ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఛాలెంజింగ్ బీస్ట్ రోల్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా నెలలు కొనసాగనుండగా లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ఈ సినిమాపై వినిపిస్తుంది.
నిజానికి ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా మరో బిగ్ స్టార్ కూడా కనిపిస్తారనే టాక్ ఉంది. అప్పట్లో సల్మాన్, షారుఖ్, హాలీవుడ్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ పాపులర్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ పేరు వినిపించడం మొదలైంది. దీనితో రాకా పై ఈ కొత్త బజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా మారింది. సో అక్షయ్ విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకార్ సంగీతం అందిస్తుండగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


