నాగ శౌర్య సినిమాలో రాశి కీ రోల్.!

నాగ శౌర్య సినిమాలో రాశి కీ రోల్.!

Published on Jun 29, 2015 7:48 PM IST

rasi
గత శుక్రవారం ‘జాదూగాడు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగ శౌర్య. ఈ సినిమాలో నాగ శౌర్య చేసిన మాస్ పెర్ఫార్మన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత నాగ శౌర్య మరో సారి లవర్ బాయ్ గా కనిపించనున్నాడు. ‘అలా మొదలైంది’ లాంటి సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీతో అనడినీ ఆకట్టుకున్న నందిని రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. గత కొద్ది రోజులుగా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర టీం అప్పుడే షూటింగ్ ని చివరి దశకు తీసుకు వచ్చేశారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి కావచ్చింది.

ఈ చిత్ర టీం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం 1996 – 2002టైంలో తెలుగు యువతను కట్టిపడేసిన అందాల భామ రాశిని సెలక్ట్ చేసారు. ఇప్పటికే రాశి పై వచ్చే సన్నివేశాలను షూట్ చేసారని సమాచారం. పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రాశి ఈ సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఈ చిత్ర టీం ఈ సినిమాకి ‘కళ్యాణ వైభోగమే’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ చిత్ర టీం బాలన్స్ ఉన్న సాంగ్స్ షూటింగ్ మొదలు పెట్టనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు