ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పాపం ప్రతాప్’.. ఎప్పుడు ఎందులో అంటే?

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పాపం ప్రతాప్’.. ఎప్పుడు ఎందులో అంటే?

Published on May 5, 2026 11:09 AM IST

Papam-Prathap

తన నటన సినిమాల ఎంపికతో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ హీరో తిరువీర్ హీరోగా నటించిన లేటెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ సినిమానే ‘పాపం ప్రతాప్’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా దర్శకుడు ఎస్ పీ దుర్గా నగేష్ తెరకెక్కించిన విలేజ్ డ్రామా ఇది కాగా గత నెల ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల అయ్యిన ఈ సినిమా మంచి ప్రమోషన్స్ నడుమ వచ్చింది. అయితే ఈ చిత్రం అనుకున్న రేంజ్ సక్సెస్ ని మాత్రం కొట్టలేదు.

దీనితో తన గత చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కంటే తక్కువే పెర్ఫామ్ చేసింది. ఇక ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఇపుడు ఓటిటి రిలీజ్ కి డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా లేటెస్ట్ గా వీరు రిలీజ్ డేట్ ని అయితే ఇచ్చేసారు. ఈ మే 7 నుంచి సినిమా తమ ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్నట్టు ఖరారు చేశారు. సో అప్పుడు మిస్ అయ్యిన వారు ఇపుడు చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి కే ఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించగా మిత్రవింద సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు