
సుధీర్ బాబు, నందితలు హీరో హీరోయిన్లుగా రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మించిన సినిమా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘ఛార్మినార్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చార్మినార్ సినిమాకు దర్శకుడైన ఆర్. చంద్రుయే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కించారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న విడుదలై ప్రేక్షకుల వద్ద నుంచి మంచి స్పందన తెచ్చుకొంది.
ఇక తమ సినిమాకు మంచి స్పందన రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ టీమ్ ఓ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. “మహేష్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో పోకిరి ఒకటి. ఆ సినిమాలో మహేష్ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరు అన్నట్లుగా ఆయన కెరీర్‌కు సెట్ అయింది. మహేష్ కెరీర్‌కు పోకిరి ఎలాగో నా కెరీర్‌కు ‘కృష్ణమ్మ..’ అలా నిలిచింది ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ హీరోగా నాకో గుర్తింపునిచ్చింది” అన్నారు.

