‘శర్వా – శ్రీను వైట్ల’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

‘శర్వా – శ్రీను వైట్ల’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 4, 2026 11:00 PM IST

Sharwanand

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం.. జులైలో పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించి.. అనంతరం, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందట. ముఖ్యంగా శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా శ్రీనువైట్ల ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట.

అన్నట్టు ఈ సినిమాలో ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ బ్యూటీ శర్వానంద్ సరసన ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్టపడుతున్నాడట.

ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా వార్తలు