
విలన్ గా భయపెట్టి, హీరోగా ఎంటర్ టైన్ చేసి, నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను అందించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మొదటిసారి తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న హీరో అల్లరి నరేష్ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని ఇది వరకే తెలియజేశాం. మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగష్టు 20 నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో మోహన్ బాబు అల్లరి నరేష్ కి పెదనాన్న పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో మోహన్ బాబుకి జోడీ కోసం అలనాటి స్టార్ అయిన రమ్యకృష్ణ, నదియా, సిమ్రాన్ లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. అలాగే ఇది మరాఠీలో హిట్ అయిన ఓ సినిమాకి రీమేక్ అని అంటున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథని మార్పులు చేసే పనిలో ఉన్నారు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే అల్లరి నరెష్ నటించిన ‘జేమ్స్ బాండ్’ సినిమా జూలై 17న రిలీజ్ కాకుంది.

