
ఎప్పటికప్పుడు తన సినిమాలలో కొత్తదనం ట్రై చేస్తూనే, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు చేసే హీరో విక్టరీ వెంకటేష్. వెంకటేష్ సినిమాలలో కాదు రియల్ గా కూడా కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు, అలాగే దైవ స్మరణ కూడా ఎక్కువ. తాజాగా వెంకటేష్ అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన 20వ తానా వేడుకలకు హాజరయ్యాడు. ఈ వేడుకలో వెంకటేష్ యువతకి కొన్ని సందేశాలను ఇచ్చారు.
‘యువత ఏ విషయన్ని సింపుల్ గా తీసుకోకూడదు. మీ అంతట మీరు కొన్ని హై స్టాండర్డ్స్ ని టార్గెట్ పెట్టుకోవాలి, ఆ వైపుగా వెళ్లి సక్సెస్ అవ్వాలని’ వెంకటేష్ అన్నాడు. అలాగే ఈ తానా వేడుకల్లో తెలుగువారితో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా ఉందని వెంకీ తెలియజేశాడు. తానా వేడుకలు రాజకీయవేత్త వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్టార్ట్ అయ్యాయి. ఈ వేడుకకి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. రాఘవేంద్ర రావుకి ఈ కార్యక్రమంలో ప్రత్యేక పురష్కారం అందించాడు.

