రజినీ కోసం విలన్ గా మారిన విక్రమ్.?

రజినీ కోసం విలన్ గా మారిన విక్రమ్.?

Published on Jul 5, 2015 7:56 PM IST

Rajini-Vikram
సౌత్ ఇండియన్ మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ రెండు సంవత్సరాలపైనే కష్టపడి చేసిన సినిమా ‘ఐ’ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై విజయాన్ని అందుకుంది. కొద్ది రోజుల క్రితమే తన తదుపరి రోబో కి సీక్వెల్ అని దాదాపు ఖరారు చేసారు. ఇప్పటికే శంకర్ చెప్పిన కథని రజినీ కూడా ఓకే చేసాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. దీనితో పాటే ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేసే పనిలో శంకర్ ఉన్నాడు.

ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రోబో సీక్వెల్ లో విక్రమ్ కూడా ఉంటాడని అంటున్నారు. అది కూడా రజినీకాంత్ కి టఫ్ పోటీని ఇచ్చే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా రోబోలో విలన్ గా షారుఖ్ ఖాన్ లేదా అమీర్ ఖాన్ లను అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పెట్టేసి రజినీకాంత్ – విక్రమ్ కాంబినేషన్ ని సెట్ చెయ్యాలనే ఉద్దేశంలో శంకర్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే విక్రమ్ కూడా కథని విన్నట్లు సమాచారం. ఒకవేళ రోబో సీక్వెల్ కోసం ఈ కాంబినేషన్ సెట్ అయితే థియేటర్ లో ఆడియన్స్ కి పండగే అని చెప్పాలి. ప్రస్తుతానికి ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

తాజా వార్తలు