
‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయం కృషి’, ‘శుభ సంకల్పం’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులను అందించిన లెజండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాధ్. రీసెంట్ గా జరిగిన ఓ వేడుకలో విశ్వనాథ్ మాట్లాడుతూ తనకి అవకాశం దొరికితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని డైరెక్ట్ చెయ్యడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. అలాగే మాట్లాడుతూ గతంలో చాలా మంది నిర్మాతలు ఎన్.టి.ఆర్ తో సినిమా చెయ్యడానికి తనని కలిసారని తెలిపాడు.
ఆయన గత సినిమాల రీమేక్ టాపిక్ గురించి మాట్లాడుతూ ‘నేను తీసిన ఏ సినిమాని మళ్ళీ ఇప్పుడు రీమేక్ చెయ్యాలని అనుకోవడం లేదు. అవి క్లాసిక్స్. ఇప్పుడు వాటిని తీస్తే ఇప్పటి ఆడియన్స్ అంచనాలను అందుకునేలా ఉండవని’ విశ్వనాధ్ తెలిపాడు. అక్కడి రిపోర్టర్స్ ఆటోబయోగ్రఫీ రాస్తున్నారా అని అడిగితే ‘పెద్దగా నవ్వి నేను ఎలాంటి ఆటోబయోగ్రఫీ రాయడం లేదని’ తెలిపాడు.

