
ఇరు రాష్ట్రాల తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, ఇండియన్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మొట్ట మొదటి ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 10న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఎంతో మంది జీనియస్ లు టెక్నికల్ టీంలో పనిచేసారు, అలాగే ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఈ సినిమాలో పనిచేసారు. అలాంటి జీనియస్ ల పేర్లు చెప్పగానే ప్రాభాస్ మదిలో మెదిలే అల్టిమేట్ ఫీలింగ్ ని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం..
జీనియస్ టెక్నికల్ టీం :
కెప్టెన్ అఫ్ ది బాహుబలి అండ్ డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి – వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మైండ్.
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని – బాహుబలి కి రియల్ హీరోస్.
కథ : వి. విజయేంద్ర ప్రసాద్ – బాహుబలి సినిమాకి ప్రాణం.
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం కీరవాణి – బాహుబలికి సౌండ్ తో ప్రాణం పోసిన మ్యుజిషియన్.
సినిమాటోగ్రఫీ : కె.కె సెంథిల్ కుమార్ – ది ఐ ఆఫ్ బాహుబలి.
ఆర్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్ – గ్రాండ్ నెస్, భారీ సెట్స్.
విఎఫ్ఎక్స్ సూపర్ విజన్ : వి. శ్రీనివాస్ మోహన్ – మిమ్మల్ని షాక్ చేస్తూ అబ్బురపరిచే విజువల్స్.
యాక్షన్ కొరియోగ్రాఫర్ : పీటర్ హెయిన్ – సూపర్బ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అంతే కాకుండా బాహుబలి ఇంజనీర్ .
లైన్ ప్రొడ్యూసర్ : ఎంఎం శ్రీవల్లి – బాహుబలి సెట్లో అందరికీ అమ్మ.
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రామా రాజమౌళి, ప్రశాంతి త్రిపిర్నేని – ది బెస్ట్ డిజైనర్స్ మరియు రాజమౌళికి సపోర్టర్స్.
మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ :
రానా దగ్గుబాటి – మునుపెన్నడూ చూడని అల్టిమేట్ విలన్.
అనుష్క – చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్న లేడీ.
తమన్నా – మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ ఇంటెన్స్ ప్రిన్సెస్.
రమ్యకృష్ణ – బాహుబలిలో అత్యంత శక్తివంతమైన పాత్ర.
సత్యరాజ్ – ఎమోషన్స్ చూపడంలో స్పెషలిస్ట్.
నాజర్ – మళ్ళీ పనిచేయాలనిపించే ఆసక్తికరమైన పర్సన్.

