తన డైట్ సీక్రెట్స్ చెప్పిన ప్రభాస్

తన డైట్ సీక్రెట్స్ చెప్పిన ప్రభాస్

Published on Jul 7, 2015 3:53 PM IST

Prabhas
ప్రస్తుత సినీ ప్రపంచంలో భాషతో సంబంధం లేకుండా అందరి నుంచి వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘బాహుబలి’. తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగిన మరియు ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అయిన ఈ సినిమాలో హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రభాస్ ఈ సినిమాలో బాహుబలి, శివుడు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల్లో వేషధారణే కాదు, ఫిజికల్ లుక్ లో కూడా మార్పు ఉంటుంది. బాహుబలి పాత్రలో బలమైన బాహువులు కలిసి కండలు తిరిగిన భారీ శరీరంతో కనపడే ప్రభాస్ శివుడు పాత్రలో దానికన్నా కాస్త తక్కువ సైజ్ లో కన్నపడతాడు.

మరి ఇలా ఎలా రెండున్నరేళ్ళు మేనేజ్ చెయ్యగలిగాడు, తనడైట్ ఏంటనేది ప్రభాస్ రివీల్ చేసాడు. ‘బాహుబలి సినిమాలో నాకు, రానాకి క్లోజప్ పెట్టి తీసే యాక్షన్ ఎపిసోడ్స్ చేసిన నెల రోజులు కేవలం కోడి గుడ్డులోని వైట్ పార్ట్ ని మాత్రమే తినేవాడిని. అలాగే రెండు పాత్ర కోసం పెరగడం, తగ్గడం దానికోసం చాలా డైట్ పాటించడం, నోరుని కట్టేసుకొని ఉండడం చాలా కష్టమైన పని. అలాగే నా డైట్ విషయంలో మా పేరెంట్స్ ని కన్విన్స్ చెయ్యడం చాలా కష్టం అయ్యింది. వాళ్ళు నా హెల్త్ విషయంలో చాలా చాలా భయపడ్డారని’ ప్రభాస్ తెలిపాడు.

ప్రభాస్ కి పోటీ ఇచ్చే ఆరడుగుల కండల వీరుడుగా రానా దగ్గుబాటి కనిపించాడు. జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు