‘వారణాసి’ గ్లింప్స్.. కొత్తదా? పాతదా?

‘వారణాసి’ గ్లింప్స్.. కొత్తదా? పాతదా?

Published on May 5, 2026 9:00 PM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ లతో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ చిత్రమే “వారణాసి”. గ్లోబల్ లెవెల్లో మంచి ఇంపాక్ట్ చూపించగలిగే సత్తా ఉన్న సినిమా ఇది కాగా ప్రస్తుతం షూట్ ఇంకా ప్రమోషన్స్ కూడా గ్లోబల్ వైడ్ సమానంగా జరుగుతూ వెళ్లిపోతున్నాయి. అయితే జూన్ నెలాఖరున రాజమౌళి ఫ్రాన్స్ కి వెళ్లనున్న సంగతి తెలిసిందే.

అయితే అక్కడ వారణాసి గ్లింప్స్ కూడా ఉంటుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ గ్లింప్స్ కొత్తదా లేక ఆల్రెడీ వదిలిన పాత గ్లింప్స్ నే అక్కడ కూడా వేస్తారా అనేది మాత్రం ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. గ్లింప్స్ అనగానే అభిమానులు అంతా కొత్తదే అనుకునే పొరపాటు ఇక్కడ లేకపోలేదు. సో అప్పుడు ప్రదర్శితం చేయనున్న కంటెంట్ కొత్తదో పాతదో అనేది మున్ముందు క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎస్ ఎస్ కార్తికేయ, కే ఎల్ నారాయణ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు