
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’. దేశవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే బాహుబలి రిలీజ్‌కు దగ్గరపడుతున్న కొద్దీ అభిమానులు ఓ పక్క ఆనంద పడడంతో పాటు మరోపక్క టెన్షన్ కూడా పడ్డారు. ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కొన్ని ఇంకా పూర్తి కాకపోవడంతో ఇవాళ్టి వరకూ కొంత టెన్షన్ పడుతూనే ఉన్నారు.
ఇక ఇప్పుడు అభిమానులంతా నిశ్చింతగా బాహుబలి సినిమా కోసం ఎదురు చూసేయొచ్చు. నేటి ఉదయం వరకూ డీఐ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోన్న డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సెంథిల్ కుమార్, ఆ పనులన్నింటినీ పూర్తి చేసేసి మాస్టర్ కాపీని సిద్ధం చేశారు. దీంతో బాహుబలికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తైనట్లే! ఇక జూలై 10న తెలుగు సినిమా గర్వంగా చెప్పబడుతున్న బాహుబలి సినిమాను చూడడమే మిగిలింది.

