ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ‘బాహుబలి’ న్యూ రికార్డ్

ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ‘బాహుబలి’ న్యూ రికార్డ్

Published on Jul 10, 2015 7:00 AM IST

baahubali

ఇండియన్ ఫస్ట్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ అయిన బాహుబలి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ తో పాటుగా యుఎస్ లో ప్రీమియర్స్ కూడా పూర్తయ్యాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించడం ప్రభాస్ – రాణాలు హీరో – విలన్స్ గా నటించడంతో ఈ సినిమా ప భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు మించే అన్ని ఏరియాల నుండి కలెక్షన్స్ వస్తున్నాయి.

ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన బాహుబలి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ తో బాహుబలి ప్రీమియర్ షోస్ వేసారు. కేవలం ఓవర్సీస్ లో వేసిన ప్రీమియర్ షోస్ తోనే ఈ సినిమా 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. కేవలం ప్రీమియర్ షోస్ తోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయడం ఇదే ప్రధమం. అది కూడా ఓ తెలుగు సినిమాకి ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం కూడా ఇదే మొదటి సారి. తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా కనిపించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఆర్కా మీడియా వారు ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు