బాహుబలి ఫస్ట్ వీక్ రిపోర్ట్ : హిందీలో ఆల్ టైం రికార్డ్

బాహుబలి ఫస్ట్ వీక్ రిపోర్ట్ : హిందీలో ఆల్ టైం రికార్డ్

Published on Jul 17, 2015 3:26 PM IST

Baahubali-pposter
ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా వస్తున్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ మోషన్ పిక్చర్ అని వార్తల్లో నిలిచి అందరినీ ఆకర్షించిన సినిమా బాహుబలి. బాహుబలి క్రేజ్ ని క్రియేట్ చేయడంలోనే కాదు రికార్డ్స్ సృష్టించడంలోనూ తన సత్తా చాటుకుంది. తెలుగు సినిమా కాబట్టి ఇరు రాష్ట్రాల్లో ఎక్కువ షేర్ కలెక్ట్ చేస్తుంది, మిగిలిన భాషల్లో కూడా చాలా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది అనుకున్నారు. కానీ ట్రేడ్ వర్గాలని కోలుకోలేని షాక్ కి గురిచేసేలా తెలుగు షేర్ కి దాదాపు దగ్గరగా హిందీ వెర్షన్ కలెక్షన్స్ రావడం రికార్డ్ గా మారింది.

మొదటి వారం బాహుబలి ఇరు రాష్ట్రాల్లో కలుపుకొని సుమారు 61 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. దీనికి దీటుగా హిందీ వెర్షన్ ఫస్ట్ వీక్ లో మొత్తంగా 46 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఈ షేర్ చూసి ట్రేడ్ వర్గాలు దిమ్మతిరిగే షాక్ కి గురయ్యారు. వీక్ డేస్ లో కూడా కంటిన్యూగా 6 కోట్ల షేర్ ని సాధించి హిందీ డబ్బింగ్ సినిమాల విషయంలో బాహుబలి ఆల్ టైం రికార్డ్ ని సృష్టించింది.

వారం
కలెక్షన్స్ (షేర్)
శుక్ర వారం 5.15 కోట్లు
శని వారం 7.09 కోట్లు
ఆది వారం  10.11 కోట్లు
సోమవారం  6.10 కోట్లు
మంగళవారం 6.15 కోట్లు
బుధవారం  6.05 కోట్లు
గురువారం 6.12 కోట్లు
మొత్తం 46.77 కోట్లు

తాజా వార్తలు