నైజాంలో రెండో వారం కూడా స్టడీగా ‘బాహుబలి’..!

నైజాంలో రెండో వారం కూడా స్టడీగా ‘బాహుబలి’..!

Published on Jul 18, 2015 8:40 PM IST

baahu-bali
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి విడుదలై పోవడం, కనీవినీ ఎరుగని బాక్సాఫీస్ రికార్డులతో సినిమా దూసుకుపోవడం జరుగుతూనే ఉంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఏకకాలంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. మొదటివారం ఈ సినిమా అన్ని చోట్లా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.

నైజాంలో గతంలో ఏ తెలుగు సినిమాకూ సాధ్యపడని రికార్డులు కొల్లగొడుతూ ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొదటివారం నైజాం ఏరియాలో ఈ సినిమా 22.58 కోట్ల షేర్ కొల్లగొట్టి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబడింది. ఇక రెండో వారం కూడా అదే జోరును కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మొదటి ప్రారంభం రోజైన నిన్నటి శుక్రవారం ఈ సినిమా 1.54కోట్ల షేర్ సాధించి రెండో వారానికి మంచి స్వాగతం పలికింది.

ఇండియాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి’, అద్భుతమైన విజువల్స్, రాజమౌళి విజన్, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచాయి. ప్రభాస్, అనుష్క, తమన్నా, అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.

తాజా వార్తలు