జోధ్పూర్ లో పూరి ‘లోఫర్’ సందడి

జోధ్పూర్ లో పూరి ‘లోఫర్’ సందడి

Published on Jul 19, 2015 10:57 PM IST

varun-tej

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన ఆరడుగుల యంగ్ హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన మూడవ సినిమా ‘లోఫర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూలై మొదటి వారంలో లాంచ్ అయ్యింది. ప్రారంభించిన నాటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టిన ఈ చిత్ర టీం హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రాజస్థాన్ లో జరగనుందని ఇది వరకే తెలియజేశాం. అందులో భాగంగానే ఈ చిత్ర టీం అంతా రాజస్థాన్ షిఫ్ట్ అయ్యింది.

ప్రస్తుతం ఈ చిత్ర టీం జోధ్పూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుణ్ తేజ్, హీరోయిన్ దిశా పటాని తదితర ముఖ్య నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అక్కడే సుమారు 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ ఇటీవలే తన రెండవ సినిమా ‘కంచె’ షూటింగ్ ఫినిష్ చేసాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది.

తాజా వార్తలు