‘పెద్ది’ యూఎస్ బుకింగ్స్ కి ముహూర్తం ఖరారు.. గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్ను

‘పెద్ది’ యూఎస్ బుకింగ్స్ కి ముహూర్తం ఖరారు.. గ్రాండ్ ఓపెనింగ్స్ పై కన్ను

Published on May 6, 2026 4:28 PM IST

ఇప్పుడు టాలీవుడ్ నుంచి రాబోతున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రమే “పెద్ది”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఇప్పుడు దగ్గరకి వస్తుండగా మేకర్స్ అన్ని పనులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా యూఎస్ మార్కెట్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ అందించారు.

అక్కడ నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా వారు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా అక్కడ బుకింగ్స్ పై సాలిడ్ అప్డేట్ ని వారు అందించారు. ఈ జూన్ 3 నుంచే ప్రీమియర్స్ అక్కడ పడనుండగా వాటి తాలూకా బుకింగ్స్ ఈ మే 7 రాత్రి 8 గంటల నుంచే మొదలు కానున్నట్టు ఖరారు చేశారు. సో బుకింగ్స్ ఇంకా ఓపెనింగ్స్ లో పెద్ది ఎలాంటి రికార్డ్స్ సెట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు