మిర్చి మ్యూజిక్ అవార్డుల్లో ‘ఊహలు గుసగుసలాడే’దే హవా!

మిర్చి మ్యూజిక్ అవార్డుల్లో ‘ఊహలు గుసగుసలాడే’దే హవా!

Published on Jul 23, 2015 4:25 PM IST

oohalu-gusagusalade-telug
‘రేడియో మిర్చి’ గత ఐదు సంవత్సరాలుగా ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’ పేరుతో సంగీత ప్రపంచంలో మనల్ని అలరించిన సినిమాలకు, పాటలకు అవార్డులు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే! హిందీలో ఇప్పటికే 2014 సంవత్సరానికి సంబంధించిన అవార్డు ప్రదానం జరగగా, నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించిన అవార్డు ప్రదాన వేడుకను నిర్వహించారు. కమల్ హాసన్, మహేష్ బాబు, జానకి తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఇక మిర్చి మ్యూజిక్ తెలుగు అవార్డుల విషయానికి వస్తే.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో 2014లో విడుదలై సంగీతం పరంగా, సినిమా పరంగా మంచి విజయం సాధించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా అన్ని మ్యూజిక్ అవార్డులను సొంతం చేసుకుంది. కళ్యాణ్ కోడూరి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియో ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉంది. ఇక ‘1 నేనొక్కడినే’ సినిమాలో ‘హూ ఆర్ యూ?’ అన్న పాటకు సౌండ్ మిక్సింగ్‌లో దేవిశ్రీ ప్రసాద్ టెక్నికల్ అవార్డు సొంతం చేసుకున్నారు.

మిర్చి మ్యూజిక్ పూర్తి అవార్డుల వివరాలిలా ఉన్నాయి..

1. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ : ఊహలు గుసగుసలాడే
2. సాంగ్ ఆఫ్ ది ఇయర్ : ఏం సందేహం లేదు (ఊహలు గుసగుసలాడే)
3. మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ ది ఇయర్ : కళ్యాణ్ కోడూరి ( ఊహలు గుసగుసలాడే )
4. లిరిసిస్ట్ ఆఫ్ ది ఇయర్ : అనంత శ్రీరామ్ ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)
5. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) : కళ్యాణ్ కోడూరి ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)
6. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్) : కళ్యాణ్ కోడూరి ( ఏం సందేహం లేదు – ఊహలు గుసగుసలాడే)
7. సౌండ్ మిక్సింగ్ ఆఫ్ ది ఇయర్ (టెక్నికల్) : దేవిశ్రీ ప్రసాద్ (హూ ఆర్ యూ? – 1 నేనొక్కడినే)

తాజా వార్తలు