లెజెండ్స్ కి అవార్డ్స్ డెడికేట్ చేసిన అల్లు అర్జున్

లెజెండ్స్ కి అవార్డ్స్ డెడికేట్ చేసిన అల్లు అర్జున్

Published on Jul 25, 2015 3:53 PM IST

Allu-arjun
టాలీవుడ్ స్టార్ హీరోస్ అల్లు వారబ్బాయి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోని లెజెండ్స్ కి ఎంతో ప్రాధాన్యతని ఇస్తారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఆయన తెలుగు లెజెండ్స్ కి ఎంత గౌరవాన్ని ప్రాధాన్యతని ఇస్తాడని నిరూపించుకున్నాడు. ఇటీవలే జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేరుకలో తనకి వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డుని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుకి డెడికేట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇది జరిగిన కూడి రోజులకి, నిన్న జరిగిన సినీ మా అవార్డ్స్ వేడుకలో అల్లు అర్జున్ గెలుచుకున్న బెస్ట్ హీరో సినీ మా అవార్డుని మూవీ మొఘల్ డా.డి రామానాయుడుకి అంకితం ఇచ్చారు.

ఇలా అల్లు అర్జున్ తనకి వచ్చిన అవార్డ్స్ ని మన తెలుగు సినిమా లెజెండ్స్ కి అంకితం ఇవ్వడమే కాకుండా ‘వారు తెలుగు సినిమాకి అసలు సిసలైన లెజెండ్స్, వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ మనకు తెలుస్తుందని’ బన్ని అన్నాడు. అల్లు అర్జున్ లెజెండ్స్ పై తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని ఇలా చాటుకోవడంతో అభిమానులు కూడా బన్నిని మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉంటుంది. ఈ సినిమా ఈ నెల 26 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ మూవీని గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు