రెండు సినిమాల షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా రకుల్!

రెండు సినిమాల షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా రకుల్!

Published on Aug 4, 2015 5:26 PM IST

rakul-preet-singh
తెలుగు సినీ పరిశ్రమలో తాజా సంచలనంగా మారిపోయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే మొదట వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా విజయంతో తెలుగులో పాగా వేసిన ఈ హీరోయిన్, అతి కొద్దికాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా వరుసగా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్న రకుల్, రెస్ట్ లేకుండా షూటింగ్‌ చేస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితమే రామ్ చరణ్ -శ్రీను వైట్ల సినిమాకు సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఆమె, రీసెంట్‌గా ఎన్టీఆర్-సుకుమార్‌ల సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అయిపోయారు.

యూకేలో భారీ ఎత్తున జరుగుతున్న ఈ షెడ్యూల్‌కు సంబంధించి రకుల్, తన పార్ట్‌ను కొంతమేర ఇంతకుముందే పూర్తి చేయగా, మిగిలిన షూటింగ్ కోసం మళ్ళీ యూకేలో ల్యాండ్ అయిపోయారు. యూకేలో జరుగుతోన్న ఈ షెడ్యూల్‌లో రెండు వారాల పాటు పాల్గొననున్న ఆమె, ఆ తర్వాత వెంటనే మళ్ళీ చెర్రీ సినిమా షూటింగ్‌కు షిఫ్ట్ అవ్వాలి. ఇలా రెండు సినిమాలతో ఒకేసారి రెండు షెడ్యూల్స్‌ను చూసుకుంటూ బిజీ బిజీ అయిపోయారు రకుల్. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, భోయపాటి శ్రీనుల సినిమా కూడా ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళింది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌కు కూడా రకుల్ సిద్ధం కావాల్సి ఉంది. దీంతో వరుసగా మూడు సినిమాలతో ఖాళీ అనేదే లేకుండా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌‌కు రకుల్ దగ్గరయ్యారనే చెప్పాలి.

తాజా వార్తలు