గోపీచంద్ మలినేనితో దిల్‌రాజు కొత్త సినిమా!

గోపీచంద్ మలినేనితో దిల్‌రాజు కొత్త సినిమా!

Published on Aug 5, 2015 11:35 PM IST

Dil-Raju
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమాలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు సున్నితమైన భావోద్వేగాలున్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ ఆయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొద్ది కాలం క్రితం చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు తీసినట్టు కనిపించిన ఆయన, తాజాగా వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు.

సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, హీరో సునీల్- దర్శకుడు వాసు వర్మ సినిమా, సాయిధరమ్ తేజ్ – అనిల్ రావిపూడి సినిమా, ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా, బెంగళూర్ డేస్ తెలుగు రీమేక్.. ఇలా ఇన్ని సినిమాలను అనౌన్స్ చేయడమే కాక, మరికొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టి దిల్‌రాజు ఖాళీ అనేదే లేకుండా కనిపిస్తున్నారు. తాజాగా దిల్‌రాజు.. ‘బలుపు’, ‘పండగ చేస్కో’ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైపోవడం విశేషంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.

తాజా వార్తలు