‘శ్రీమంతుడు’ కృష్ణా జిల్లా ఫస్ట్ డే కలెక్షన్స్

‘శ్రీమంతుడు’ కృష్ణా జిల్లా ఫస్ట్ డే కలెక్షన్స్

Published on Aug 8, 2015 12:01 PM IST

srimanthudu (2)
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ భాషల్లో పెద్ద ఎత్తున విడుదలైంది. ఊరిని దత్తత తీసుకోవడమనే అంశాన్ని సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి తీసిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ సినిమా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డ్‌లతో కనిపించి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టాయి.

ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా మొదటిరోజు సాధించిన కలెక్షన్లను చూస్తే.. 1.20 కోట్ల షేర్ సాధించి సినిమా స్ట్రాంగ్‌గా నిలబడింది. సుమారు 2.96 కోట్ల రూపాయలకు ఈ సినిమా కృష్ణా రైట్స్ అమ్ముడుపోగా కేవలం మొదటిరోజే 1.20 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఈ వీకెండ్‌కల్లా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళుతోందని తెలుస్తోంది. ఇక ఈ ఒక్క ప్రాంతంలోనే కాక ఏపీ, తెలంగాణాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ శ్రీమంతుడు ఇదే స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది.

తాజా వార్తలు