చెన్నై బాక్సాఫీస్ వద్ద శ్రీమంతుడిదే టాప్ ప్లేస్!

చెన్నై బాక్సాఫీస్ వద్ద శ్రీమంతుడిదే టాప్ ప్లేస్!

Published on Aug 10, 2015 8:49 PM IST

srimnathudu
సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’ గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో మొదటి వారాంతం ఏపీ, నైజాం, ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ, తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ తర్వాతి స్థానంలో ‘శ్రీమంతుడు’ నిలిచింది. ఇక తమిళనాట కూడా శుక్రవారం రోజునే ‘సెల్వందన్‌’గా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి కలెక్షన్లనే రాబడుతోంది.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమంతుడు’లో ఓ సోషల్ మెసేజ్ అంశాన్ని, కమర్షియల్‌గా చెప్పిన విధానం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. మొదటి షో నుంచే మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద ‘శ్రీమంతుడు’ పేరు నిలబెడుతోంది. చెన్నై సిటీలో ఈ సినిమా తెలుగు వర్షన్ ఈ వీకెండ్‌కు టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది. గత కొన్ని వారాలుగా ఈ పొజిషన్‌లో బాహుబలి తమిళ వర్షన్ ఉంటూ వచ్చింది. ఇక ఒక స్ట్రైట్ తెలుగు సినిమా చెన్నైలో బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషమే! ఒక్క చెన్నై సిటీలోనే ‘శ్రీమంతుడు’ సుమారు 50లక్షలకు పైనే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. ‘శ్రీమంతుడు’ తమిళ వర్షన్ ‘సెల్వందన్’ కూడా తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో బాగా నడుస్తోంది.

మైత్రీ మూవీస్‌తో కలిసి మహేష్ తన సొంత బ్యానర్ ఎంబీ ప్రొడక్షన్స్‌పై ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే! శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజా వార్తలు