
టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలతో పోల్చుకుంటే ప్రయోగాత్మక లేదా ట్రెండ్ సెట్ చేసే ఒక న్యూ జోనర్ ఫిల్మ్స్ చాలా తక్కువ, చాలా అరుదుగా కూడా వస్తుంటాయి. అలా అతి తక్కువగా వచ్చే డిఫరెంట్ డైరెక్టర్స్ లో ఒకడే చంద్రశేఖర్ యేలేటి. తన మొదటి సినిమా ‘ఐతే’తోనే న్యూ ట్రెండ్ ని సెట్ చేసాడు. ఇలాంటి సినిమా ఆడుద్దా అన్న రోజుల్లోనే బాక్స్ ఆఫీసు వద్ద హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చంద్రశేఖర్ తీసిన అనుకోకుండా ఓ రోజు సినిమా కూడా అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ప్రయాణం లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తీసిన చంద్రశేఖర్ యేలేటి లాస్ట్ ఫిల్మ్ ‘సాహసం’.
ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న చంద్రశేఖర్ యేలేటి తన నెక్స్ట్ సినిమా కోసం ఓ ఫ్యామిలీ డ్రామాని సిద్దం చేస్తున్నాడు. ఫేమస్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత అయిన సాయి కొర్రపాటి ప్రొడక్షన్ లో చంద్రశేఖర్ యేలేటి నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఇంకా టైటిల్ కాని ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కోసం కొత్త నటీనటుల్ని పరిశీలిస్తున్నారు. అలాగే ప్రముఖ పాత్రల కోసం సీనియర్ యాక్టర్స్ ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా కాకుండా విక్టరీ వెంకటేష్ తో కూడా ఓ సినిమా చెయ్యడానికి చర్చలు జరుపుతున్నాడు చంద్రశేఖర్ యేలేటి.

