ఇంటర్వ్యూ : గౌతమ్ మీనన్ – నితిన్ నిర్మాతల హీరో!

ఇంటర్వ్యూ : గౌతమ్ మీనన్ – నితిన్ నిర్మాతల హీరో!

Published on Aug 15, 2015 3:41 PM IST

Gautam-Menon
దర్శకుడిగా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న గౌతమ్ మీనన్, నిర్మాతగా మారి కొరియర్ బాయ్ కళ్యాణ్ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. వరుస హిట్లతో జోరు మీదున్న నితిన్ హీర్రోగా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్థిక సమస్యలతో పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గౌతం మీనన్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) సడెన్‌గా తెలుగులో నిర్మాత అవతారం ఎత్తారు. ఎందుకని?

స) చాలా కాలం నుంచీ నేను సినిమాలు నిర్మిస్తూనే ఉన్నా. ఈ కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యా. మనమే నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో గురు ఫిల్మ్స్‌తో కలిసి ఈ సినిమా చేశా. తెలుగులో నిర్మాతగా ఇది మంచి ఎంట్రీ.

ప్రశ్న) సినిమా రిలీజ్‌కు ఇంత లేట్ అయింది. ఎందుకని?

స) మాకు తమిళ వర్షన్‌కు సంబంధించిన కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. దాంతో తెలుగు వర్షన్ రిలీజ్ కూడా ఆపేయాల్సి వచ్చింది.

ప్రశ్న) ఈ సినిమా రిలీజ్ లేటవ్వడంతో నితిన్ అసహనానికి గురయ్యారా?

స) అలాంటిదేమీ లేదు. నితిన్ కూడా ఒక నిర్మాతే కావడంతో పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. నితిన్ నిర్మాతల హీరో.

ప్రశ్న) ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ టైటిల్ కొత్తగా ఉంది. ఈ ఐడియా ఎవరిది?

స) ఈ ఐడియా నితిన్‌దే. నితిన్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఈ పేరైతే బాగుంటుందని నితిన్ సూచించాడు.

ప్రశ్న) తెలుగు వర్షన్, తమిళ వర్షన్‌ల మధ్య తేడాలేమేం ఉంటాయ్?

స) తమిళ వర్షన్‌లో జై హీరోగా చేశాడు. తెలుగు, తమిళ వర్షన్స్‌కి చాలా తేడాలే ఉన్నాయి. తమిళంలో కొంత కామెడీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నితిన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కొంత రొమాన్స్ ఉంటుంది.

ప్రశ్న) నితిన్ పర్ఫామెన్స్ గురించి చెప్పండి?

స) నితిన్ హ్యాండ్‌సమ్‌గా కనిపించడంతో పాటు అద్భుతంగా నటించాడు. ప్రొడక్షన్ గురించి కూడా తెలిసిన వాడు కావడంతో నితిన్ ఆ రకంగానూ మాకు బాగా హెల్ప్ అయ్యాడు.

ప్రశ్న) మీరు ఎక్కువగా లవ్, పోలీస్ స్టోరీలే తీస్తారెందుకని?

స) నవ్వుతూ.. ఇప్పట్లో నేను మళ్ళీ ఓ పోలీస్ డ్రామా తీయట్లేదు. రొమాన్స్ విషయానికి వస్తే.. అది అందరికీ నచ్చే జానర్‌ కావడంతో అలాంటి సినిమాలు చేస్తుంటా. లవ్‌స్టోరీస్ తీయడానికి ఎక్కువగా ఇష్టపడతా.

ప్రశ్న) నాగ చైతన్యతో సినిమా ఎంతవరకు వచ్చింది?

స) ప్రస్తుతం 60%పైనే షూటింగ్ పూర్తైంది. సినిమా చాలా బాగా వస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాగ చైతన్య కూడా చాలా బాగా చేస్తున్నాడు.

ప్రశ్న) ఏ మాయ చేశావేకు సీక్వెల్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?

స) అవును. అయితే తెలుగులో కథ సుఖాంతం కావడంతో ఇక్కడ సీక్వెల్ ఉండదు. తమిళంలో కచ్చితంగా సీక్వెల్ చేయాలన్న ఆలోచన ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు