
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 7న రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సినీ ప్రముఖులందరి నుంచి కూడా మన్ననలు అందుకుంది. అంతటితో ఆగకుండా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూసి ప్రశంశలు కురిపించారు. కానీ తాజాగా మహేష్ బాబుకి ఓ స్పెషల్ పెర్సన్ నుంచి మన్ననులు అందాయి. అతనెవరో కాదు మహేష్ బాబు చాలా ఇష్టంగా అభిమానించే కమల్ హాసన్. కమల్ కుమార్తె అయిన శృతి హాసన్ శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే శృతి హాసన్, కమల్ హాసన్ కలిసి శ్రీమంతుడు సినిమా చూసారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ ‘ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చూసాను. సినిమా చాలా బాగుంది. తెలుగు ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉన్న కమర్షియల్ సినిమా. స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ ఇలాంటి కాన్సెప్ట్ చేసినందుకు మెచ్చుకోవాలి. శృతి హాసన్ కూడా చాలా బాగా చేసింది. ఈ చిత్ర డైరెక్టర్, నిర్మాతలకి హిట్ అయినందుకు శుభాకాంక్షలు’ తెలిపాడు. శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద హిట్ అవ్వడంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో మహేష్ బాబు తన ఆనందాన్ని అందరితో పంచుకోవడమే కాకుండా, అభిమానులకు చాలా థాంక్స్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

