తిరుపతిలో షురూ అయిన నరేష్ – మోహన్ బాబుల అల్లరి.!

తిరుపతిలో షురూ అయిన నరేష్ – మోహన్ బాబుల అల్లరి.!

Published on Aug 19, 2015 3:45 PM IST

Mama-Manchu-Alludu-Kanchu
విలన్ టు హీరోగా మారో 550కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా, హీరో టు నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలను నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు టాలీవుడ్ అల్లరోడు అల్లరి నరేష్ తో కలిసి చేస్తున్న సినిమా ‘మామ మంచు – అల్లుడు కంచు’. మోహన్ బాబు ఏమో తన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ కి మతిపోగోడితే, అల్లరి నరేష్ ఏమో తన కామెడీ టైమింగ్ తో పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు. ఆగష్టు మొదటి వారంలో ఈ సినిమాలో వచ్చే కొన్ని బేసిక్ షాట్స్ మరియు సీన్స్ ని హైదరాబాడ్ లో షూట్ చేసారు. ఈ సినిమా మెయిన్ షెడ్యూల్ ఆగష్టు 19 నుంచి తిరుపతిలో మొదలు కానుందని ఇది వరకే తెలియజేశాం.

అనుకున్న దాని ప్రకారమే ఈ సినిమా అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఫినిష్ చేసుకొని ఈ రోజు ఉదయం తిరుపతిలో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు. మోహన్ బాబు, అల్లరి నరేష్ లు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్ గ్యాప్ లేకుండా కంటిన్యూగా జరగనుంది. ఈ సినిమాలోని మేజర్ పార్ట్ ని తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూట్ చేయనున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు – అల్లరి నరేష్ లు మామ అల్లుల్లుగా కనిపించి తెలుగు ప్రేక్షకులను నవ్వించనున్నారు. మోహన్ బాబుకి జోడీగా అలనాటి స్టార్స్ రమ్యకృష్ణ, మీనాలు నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ జోడీ కోసం అన్వేషణ జరుగుతోంది.

ఓ మరాఠీ సినిమాకి స్పూర్తిగా తీసుకొని చేస్తున్న ఈ సినిమా కథని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసాడు. మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు