నాగ చైతన్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ.?

నాగ చైతన్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ.?

Published on Aug 23, 2015 9:51 AM IST

Naga-Chaitanyas-first-look
2015 మే 29న మలయాళంలో రిలీజ్ అయిన ‘ప్రేమమ్’ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మలయాళంలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మలయాళంలో అన్ని పాత సినిమాల రికార్డ్స్ ని స్మాష్ చేసి టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నెంబర్ 1 ప్లేస్ ని దక్కించుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలనుకోవడం, ఫైనల్ గా టాలీవుడ్ యంగ్ అండ్ అక్కినేని ఫ్యామిలీ హన్డ్సం హీరో నాగ చైతన్యని హీరోగా సెలెక్ట్ చెయ్యడం జరిగిపోయిందని ఇది వరకే తెలియజేశాం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని హీరోయిన్స్ కోసం క్రేజీ హీరోయిన్స్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. మాకు అందిన న్యూస్ ప్రకారం బాలీవుడ్ యంగ్ అండ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రాని ఓ హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పరిణీతి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. తను కాకుండా మరో హీరోయిన్ కోసం దిశా పటానిని పరిశీలిస్తున్నారు. మూడవ హీరోయిన్ కోసం కూడా అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్స్ విషయంలో క్లారిటీ వస్తుంది. ‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన చందూ మొండేటిని ‘ప్రేమమ్’ రీమేక్ వెర్షన్ కి దర్శకత్వం వహించనున్నాడు. ‘జులాయి’, ‘S/O సత్యమూర్తి’ లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మించనున్నాడు.

తాజా వార్తలు