మరో కొత్త అవతారంలో కోన వెంకట్..!

మరో కొత్త అవతారంలో కోన వెంకట్..!

Published on Aug 25, 2015 12:13 AM IST

Kona-Venkat3
కోన వెంకట్.. తెలుగులో రచయితగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వ్యక్తి. పలు బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చి, సినీ పరిశ్రమలో తనదైన బ్రాండ్‌ను సెట్‌ చేసిన కోన వెంకర్ నిర్మాతగానూ గీతాంజలి సినిమాతో మంచి హిట్ ఇచ్చారు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం ఆయన వరుస హిట్లతో జోరుమీదున్న నిఖిల్‌ హీరోగా ‘శంకరాభరణం’ పేరుతో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఉదయ్ నందనవనమ్ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందుతోన్న ఈ సినిమాలో కోన వెంకట్ నిర్మాతగా, రచయితగా మాత్రమే కాక మరో కొత్త అవతారంతో దర్శనమివ్వనున్నారు. శంకరాభరణంలో ఓ పాటకు స్వయంగా కోన వెంకట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ తెలియజేస్తూ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో షేర్ చేసుకున్నారు. నిఖిల్, నందితలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రచయితగా, నిర్మాతగా మెప్పించిన కోన వెంకట్ కొరియోగ్రాఫర్‌గా ఎలా మెప్పిస్తారన్నది చూడాలి. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సరికొత్త కథతో శంకరాభరణం సినిమా రూపొందుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు